top of page

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సురేష్ నాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 31, 2024
  • 1 min read

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సురేష్ నాయుడు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


బేపారి మునీర్ అహ్మద్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో జమ్మలమడుగు బైపాస్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటుచేసిన బిఎల్ఎఫ్ బ్లాక్ కాంక్రీట్ ప్రొడక్ట్స్ ను గురువారం ఉదయం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్ ముక్తియార్, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఐదవ వార్డ్ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్ లు ఇటుకలు, బ్లాక్స్ తయారు చేసే యంత్రాలను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ యజమాని మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో మునుపెన్నడు లేనటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్కింగ్ టైల్స్, సిమెంట్ బ్లాక్ తయారీ సంస్థను ప్రొద్దుటూరులో నెలకొల్పటం జరిగిందని, గతంలో ఇక్కడి ప్రజలు వివిధ ప్రాంతాల నుండి బ్లాక్ కొనుగోలు చేసేవారని, అందరికీ అందుబాటు ధరల్లో వారికి కావలసిన డిజైన్లు తయారు చేసి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page