top of page

వైసీపీ సవాలును స్వీకరిస్తున్నాం - బీజేపీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2023
  • 1 min read

వైసీపీ సవాలును స్వీకరిస్తున్నాం - బీజేపీ

2024 ఎన్నికలలో ప్రొద్దుటూరులో బీజేపీకి 35 వేల పైచిలుకు ఓట్లు వస్తాయని మీరు భావిస్తున్నారా?

  • అవును - YES

  • లేదు - NO

  • చెప్పలేము - CAN'T SAY

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రురల్ మండల ఉపాధ్యక్షుడు ఐ. నరసింహ ప్రకాష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో బీజేపీ పార్టీకి నియోజకవర్గంలో పదివేలు ఓట్లు కూడా దక్కవని వైసీపీ నాయకులు చేసిన సవాలును ఆయన స్వీకరిస్తూ, దాదాపు ముప్పై అయిదు వేల పైచిలుకు ఓట్లు బీజేపీకి రానున్నట్లు జోస్యం చెప్పారు. అట్లు రాని యెడల రాజకీయ సన్యాసం తీసుకుంటామని ప్రతిసవాళ్లు విసిరారు. ఇకనైనా వైసీపీ నాయకులు బీజేపీ పార్టీపై, ఆ పార్టీ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు పై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓబులేసుగారి వెంకటేష్, రామసుబ్బయ్య, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page