top of page

భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 30, 2022
  • 1 min read

జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్రకు ప్రభుత్వ అనుమతులు లభిస్తాయా?

  • YES - లభిస్తాయి

  • NO - లభించవు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

భారతీయ జనతా యువ మొర్చ జిల్లా అధ్యక్షుడు శ్రావణ కుమార్ రెడ్డి నేడు ప్రొద్దుటూరు బీజేపీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని. గతంలో ప్రొద్దటూరుకు రావలసిన మెడికల్ కాలేజిని పులివెందులకు తీసుకుని వెళ్లారని, ఉన్నత చదువులు చదివిన యువకులతో మద్యం షాపుల్లో మద్యం అమ్మిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కె దక్కిందని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 21వ తేదీ వరకు భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర చేపట్టామని, ఇందులో భాగంగా ఆగష్టు 5వ తేదీన సాయంత్రం, 5 గంటలకు యాత్ర ప్రొద్దుటూరు చేరుకోనుందని కావున నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యెల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, పలువురు నియోజకవర్గ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page