top of page

కుల వివక్ష విభేదాలు లేని భారత సామ్రాజ్యాన్ని నిర్మించాలి - బిజెపి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 6, 2023
  • 1 min read

కుల వివక్ష విభేదాలు లేని భారత సామ్రాజ్యాన్ని నిర్మించాలి - బిజెపి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న బిజెపి నేతలు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


కుల వివక్ష విభేదాలు లేని భారత సామ్రాజ్యాన్ని, రిజర్వేషన్లు బహిష్కరిస్తూ ప్రభుత్వాలు పునరాలోచన చేసే ప్రయత్నం చేయాలని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా బిజెపి ప్రొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల బిజెపి కార్యాలయాల నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశామని. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరులో బిజెపి నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారని, సమకాలీన పరిస్థితులలో అస్పృశ్యతకు గురవుతున్న ప్రజలకు ఓటు హక్కు కల్పించి రాజ్యాంగాన్ని ముందుకు నడిపించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కడప జిల్లా కార్యదర్శి జింక సుబ్రహ్మణ్యం, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వంకధార నరేంద్ర రావు, రాజుపాలెం మండలం అధ్యక్షుడు నరసింహులు, బిజెపి నాయకులు శరత్ బాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page