top of page

అంబేద్కర్ మన అందరి వాడు - ఆకేపాటి వెంకట్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 14, 2022
  • 1 min read

అంబేద్కర్ మన అందరి వాడు - జయంతి సభలో చిట్వేల్ బిజెపి అధ్యక్షులు ఆకేపాటి వెంకట్ రెడ్డి.

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భముగా చిట్వేలి అంబేద్కర్ సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహానికి బిజెపి మండల అధ్యక్షులు ఆకేపాటి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తొంబరపు సుబ్బరాయుడు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభద్రమ్మ, కార్యదర్శులు మరియు కార్యకర్తల తో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్కరి వారు కాదని అందరివారని చిన్నతనం నుంచి తాను చవిచూసిన ఇబ్బందులను దీటుగా ఎదుర్కొనీ అంటరానితనం, కుల వివక్ష పై అలుపెరగని పోరాటం చేసి.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సంఘసంస్కర్తగా, భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా తాను అందించిన సేవలు అమోఘమని వారు కారణజన్ములని, దేశ కీర్తిని దశదిశలా చాటిన అంబేద్కర్ మన అందరి వారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా కార్యదర్శి సుబ్రమణ్యం, యన్నారు దిలీప్, హరినాథ్ గుప్తా, నాగేశ్వరరావు, రాజా, సుబ్బరాయుడు, సుధీర్, హరి, నాగేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page