top of page

బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర కు మద్దతుగా ప్రచారం

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 1, 2023
  • 1 min read

బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర కు మద్దతుగా ప్రచారం

బిజెపి అభ్యర్థి రాఘవేంద్రకు మద్దతుగా రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట పట్టణంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను పూరిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారు దాచుకున్న డబ్బును కూడా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకొని వారిని పూర్తిగా ఇబ్బంది పెడుతూ మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు అందర్నీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వారిని మోసం చేయడం జరిగిందని అన్నారు. కావున ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులు అందరూ ఈ పట్టుబద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ అభ్యర్థి రాఘవేంద్రకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page