బైక్ ర్యాలీని విజయవంతం చేద్దాం. దేశభక్తిని చాటుదాం. ఎమ్మార్వో మురళీకృష్ణ.
- DORA SWAMY

- Aug 6, 2022
- 1 min read
రేపు ఉదయం జరగబోవు... బైక్ ర్యాలీని విజయవంతం చేయండి.
---స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాలి.అందరూ ఆహ్వానితులే.
చిట్వేలి తాసిల్దార్ మురళీకృష్ణ.

ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిట్వేలి మండల పరిధిలో రేపు ఉదయం భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేసేందుకు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు మరియు సిబ్బంది సన్నద్ధం కావాలని చిట్వేలు మండల తహసిల్దారు మురళీకృష్ణ కోరారు.
ఈ విషయంపై మండల అధికారులు ఎంపీడీవో మోహన్, స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశమై పలు విషయాలను చర్చించారు.
ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు మండల మరియు గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని;ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని ఎమ్మార్వో మురళీకృష్ణ కోరారు.



Comments