నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి
- EDITOR

- Jun 9
- 1 min read
నిస్పాక్షికంగా డిఎస్సీ నిర్వహణ - టిడిపి జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి

అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల స్వల్ప కాలంలోనే మెగా డీఎస్సీని నిర్వహించి, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో ప్రాక్టికల్‌గా నిరూపించామని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ. మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ నాయకులు పనిగట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారి తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంతటి బృహత్తర కార్యక్రమంపై దుష్ప్రచారం చేయడం వైసీపీ నాయకులు తక్షణమే మానుకోవాలని ఆయన హితవు పలికారు. గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అనేది ఒక కలగానే మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలను గత ప్రభుత్వం అణచివేసిందని మండిపడ్డారు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో , మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి, వేలాది మంది నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాన్ని నింపామని భూపేష్ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఎంతో నిస్పక్షపాతంగా నిర్వహించిన డిఎస్సీ పై ఆరోపణలు మానుకోని పక్షంలో వైకాపాకు నిరుద్యోగులే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. సమావేశంలో తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి, టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్, మనోజ్ లు పాల్గొన్నారు.



Comments