top of page

ఘనంగా భూపేష్ పుట్టినరోజు వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 18, 2022
  • 1 min read

జమ్మలమడుగు టిడిపి ఇంచార్జ్ భూపేష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా, సోమవారం ఆర్టిపిపి కాలనీలోని ఫౌంటెన్ దగ్గర టిడిపి యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ముఖ్య అతిథిగా టిడిపి ఎర్రగుంట్ల మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మధుసూదన్, రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి బిఎంఎస్ ఆఫీస్ దగ్గర టిడిపి కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పొన్న శివ శంకర్ రావు మాట్లాడుతూ టిడిపి ఇంచార్జ్ యువనేత భూపేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జమ్మలమడుగు నియోజవర్గంలో టిడిపిని తిరుగులేని శక్తిగా మార్చగల శక్తి ఒక భూపేష్ రెడ్డికే ఉందని ఆయన కొనియాడారు. పొన్న చంద్ర మాట్లాడుతూ టిడిపి పార్టీకి కార్యకర్తలకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అదే విధంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. రాంప్రసాద్ మాట్లాడుతూ జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో శివశంకరరావు, చిలకల కృష్ణయ్య, పొన్న చంద్ర రాంప్రసాద్, కుమార్ రాజా, మునిరాజు, అశోక్, వెంకటేష్, అశోక్ కుమార్, వెంకీ, సుధీర్, సుబ్బయ్య, వంశి, శ్రీకృష్ణ, మహేష్, దంతం శంకర్, దంతం శీను, సుధాకర్ రెడ్డి, చిత్రాల రమేష్, సేట్రాకు వినయ్, అఖిల్, సుధీర్, భూమిరెడ్డి శ్రీనివాసులు, రామిశెట్టి వెంకట రంగా, సూదుల మధుసూదన్, గద్దె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page