top of page

సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 27, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, వేంపాల్ నగర్ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో . సత్యసాయి ఆరాధ్యుడు గళ్ళ శంకర్ సాయిరాం ఆధ్వర్యంలో వంద మంది నారాయణలకు (పేదవాళ్లకు) నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వైయస్సార్ పార్టీ జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి, స్టీల్ ప్లాంట్ డివిఆర్ యూనియన్ డి వి రమణ, సత్యసాయి సేవ కమిటీ సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తిప్పల వంశీ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న నా మిత్రుడు శంకర్రావు కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నడుపూరు యూపీ స్కూల్లోనూ తన వంతు బాధ్యతగా పేద పిల్లలకు ఒక పూట ఫలహారము అందజేయడం ప్రతి శివరాత్రికి అప్పికొండ సోమేశ్వర స్వామి గుడిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ భజన మండలి ఎప్పుడూ కూడా ప్రతి సేవలోనూ నిమగ్నులై చేస్తున్నారని వాపోయారు ఈ విషయంలో ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్న డి వి రమణ గారు ఇతర సభ్యులు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరడమైనది తదనంతరం పేదవాళ్లకు సరుకులు అందజేయడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page