top of page

కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 21, 2023
  • 1 min read

కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు

భిక్షాటనతో సేకరించిన చిల్లరతో నామినేషన్‌ సమర్పణ

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న యంకప్ప

దేశంలో ఏ ఎన్నికల్లో నిలబడాలి' అన్నా స్థాయిని బట్టి నోట్ల ఖర్చు మారుతుంది. అయితే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించారు. ఇందుకు భిక్షాటనతో పోగు చేసిన రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ యాచించారు. అలా సేకరించిన నాణేలనే గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు. 2 గంటలు శ్రమించి చిల్లరంతా లెక్కించి, నామినేషన్‌ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. అనంతరం యంకప్ప మాట్లాడుతూ.. ‘నేను ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్పా. వారి నుంచే డిపాజిట్‌ డబ్బూ సమీకరించా’ అని తెలిపారు. పగలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే యంకప్ప రాత్రిళ్లు ఆలయాల లోగిళ్లలో పడుకుంటారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page