top of page

ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేయాలి - భత్యాల చెంగల రాయుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 7, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, నందలూరు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త రోజు గంట పాటు పార్టీ కోసం సైనికుడిలా పని చేయాలని రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భత్యాల చెంగల రాయుడు అన్నారు గురువారం సాయంత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య ఆధ్వర్యంలో టిడిపి మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ నేడు రాష్ట్రంలోని వైసిపి పాలనలో ప్రజలపై వివిధ రకాలుగా భారం పడి జీవనం కష్టసాధ్యంగా మారిందని అన్నారు. నేడు రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి తెలుగ దేశం పార్టీ కార్యకర్తలను వివిధ రకాలుగా వేధిస్తూ అనవసర కేసులు పెట్టి హింసిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మాజీ రీజినల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మండల మాజీ అధ్యక్షులు సమ్మెట శివప్రసాద్, రాజంపేట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్, టిడిపి నాయకులు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొబ్బిళ్ళ సుబ్బరాయుడు, టిడిపి నాయకులు తాటి సుబ్బరాయుడు, మోడపోతుల రాము ,గంధం గంగాధర్,చామంచి హరి, సుదర్శన్, చామంచి పెంచలయ్య, కొండ శ్రీనివాసులు, కానకుర్తి వెంకటయ్య, సుబ్రమణ్యం నాయుడు , నారప్ప శెట్టి శివయ్య, ఉప్పు శెట్టి రెడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page