top of page

ఖాతాదారుల సేవలో బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 15, 2022
  • 1 min read

ఖాతాదారుల సేవలో బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 15


ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్డు నందు నూతనంగా బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర శాఖను మునిసిపల్ కమీషనర్ రమణయ్య, బ్యాంక్ రీజినల్ మేనేజర్ జిఎస్డి ప్రసాద్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది పైగా శాఖలు గలవని, నేడు ప్రొద్దుటూరులో నూతన శాఖను ఏర్పాటు చేసి ప్రారంభించటం జరిగిందని, తమ ఖాతాదారులకు అత్యున్నతమైన సేవలను అందించటమే తమ లక్ష్యంగా, ప్రజలకు అతి స్వల్ప వడ్డీతో వివిధ ఋణాల రూపేనా ఋణం మంజూరు చేస్తామని, ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయం కలదని తెలిపారు. అనంతరం కమిషనర్ రమణయ్య మాట్లాడుతూ ముందుగా బ్యాంకు రీజనల్ మేనేజర్, ప్రొద్దుటూరు శాఖ మేనేజర్లకు శుభాకాంక్షలు తెలియచేసారు. రానున్న రోజుల్లో ప్రజలకు బ్యాంక్ అఫ్ మహారాష్ట్ర ద్వారా విస్తృత సేవలందించి, లాభాల దిశగా పయనించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో మేనేజర్ ఉమాశంకర్, బ్యాంక్ ఉద్యోగులు, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పెద్దలు, పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page