top of page

విజేతలకు బహుమతులను అందించిన బియ్యపు పవిత్ర రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

నెహ్రూ యువకేంద్రం చిత్తూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తొట్టంబేడు బ్లాక్ లో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ విజేతలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి, డి ఎస్ పి ధర్మారపు విశ్వనాధ్, మిద్దెల హరి విచ్చేసి అందించడం జరిగింది ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో పాల్గొని మానసిక వికాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపినారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నెహ్రూ యువ కేంద్రం కృషి ఎంతో అభినందనీయమని తెలిపినారు అనంతరం మిద్దెల హరి మాట్లాడుతూ యువత చెడు మార్గంలో నడవకుండా చదువు మీద ఏకాగ్రత మానసిక ఆనందం కావాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల అలవాటు చేసుకోవాలని తెలిపినారు అనంతరం విజేతలకు మెడల్స్ సర్టిఫికెట్ మరియు మెమొంటో లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు గోపి క్రాంతి చంద్రశేఖర్ సంస్థ వాలంటీర్ రాజ్ కుమార్ ఎన్ వై కే వాలంటీర్ తిరుమల రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page