top of page

రాజుపాళెంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 12, 2022
  • 1 min read

కడప జిల్లా, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామంలో నేడు ఎమ్.మ్మె.ల్సీ గోవిందరెడ్డి ఎమ్మ్మెల్యే సుధా ఆధ్వర్యంలో నూతనముగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని అలాగే డా.వై.యస్.ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మ్మెల్యే సుధా మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పధకాలు, సేవలు అందేలా సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో సచివాలయాన్ని అలాగే రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరు సచివాలయ సేవలను వినియోగించుకోవాలని, ముఖ్యంగా రైతులు ఎటువంటి పంట నష్ట నివారణ చర్యలు లేదా వ్యవసాయ భూమికి సంబంధించి ఏ అవసరం వచ్చినా రైతు భరోసా కేంద్రంలోని వారిని సంప్రదించాలని, ఈ సందర్భంగా ఆమె హితువు పలికారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page