top of page

ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగింపు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 16, 2022
  • 1 min read

ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగింపు

ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంతో తల్లిదండ్రులు పాపను రథంపై ఊరేగించిన ఘటన పంజాబ్‌లో జరిగింది. అమృత్‌సర్‌కు చెందిన సాగర్‌, జాన్వి దంపతులకు రెండు రోజుల క్రితం ఆడబిడ్డ జన్మించింది. పాపను ఆసుపత్రి నుంచి రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు బాజాలతో, బంధువుల కోలాహలం మధ్య దీన్ని వేడుకగా నిర్వహించారు. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని తాము భావిస్తామని, పాప పుట్టడంతో తమ సంతోషం రెట్టింపు అయ్యిందని సాగర్‌, జాన్వి దంపతులు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page