top of page

ఘనంగా బాబు జగజ్జివన్ రావు 115వ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 5, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర విలేకరి, జీవీఎంసీ పరిధిలో పెదగంట్యాడ 76 వార్డు నడుపూరు గాంధీ పార్క్ వద్ద వై ఎస్ ఆర్ సి పి 76 వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో బాబు జగజ్జివన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుగా గాజువాక వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథి దేవన్ రెడ్డి మాట్లాడుతూ.బాబు జగ్జీవన్ రామ్ భారతీయులలో ప్రముఖ సభ్యుడిగా కొనసాగారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ కోసం నలభై సంవత్సరాలుగా విస్తృతమైన పోర్ట్ ఫోలియోలలో హృదయపూర్వకంగా పనిచేసింది, తరువాత 1977 నుండి 1979 వరకు భారత ఉప ప్రధానమంత్రి అయ్యారు అని అన్నారు. ఇలాంటి మహానీయులు పుట్టిన రోజులు వర్ధంతులు చేసుకోవడం మన పూర్వ జన్మ సుకృతం అని అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని మన నడవడిక లో వారిని తీసుకోవాలని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరుపుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో 64వ వార్డ్ వైసిపి ఇన్ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, తాటికొండ జగదీశ్, తాటికొండ అచ్చత్, అందిబోయిన సన్నీ, దీని శెట్టి చిన్నారావు, బ్రహ్మానంద రెడ్డి, ములకలపల్లి ప్రసాద్, నడుపూరు శ్రవణ్ కుమార్, ముమ్మిడివరం నరసింహ మూర్తి, గోంప రమేష్, గోంప రమజ్యోతి, పత్రీ దేవి, నాయుడు సుధాకర్, నాయుడు సాయి, శరత్ కుమార్, పిత గురుమూర్తి, మీసాల ఉమ శంకర్, మల్లి హరి ప్రసాద్,పెంట కోట పైడి రాజు, యందవ రమేష్, చిట్టిమాన శ్రీనివాస్, ఇళ్ల శివ తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page