ఆటోనగర్లో మా భూమిని ఖబ్జా చేశారు - బాధితులు
- VOICE OF HERALD

- Jun 30, 2022
- 1 min read
వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఈ మధ్య చాలా భూదందాలు వెలుగులోకి వచ్చిన మాట విదితమే బద్వేలు, కడప, పోరుమామిల్ల, ఇప్పుడు కొత్తగా ప్రొద్దుటూరుకు ప్రాకింది. కొత్తపల్లె పంచాయతీ సేర్వే నంబర్ 539 లో 85 సెంట్ల భూమిని కొందరి నాయకుల అండదండలతో ఆటోనగర్ లోని తమ 85 సెంట్ల భూమిని ఆటోనగర్ అసోసియేషన్ లోని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించి, తమ భూమి వారికే చెందుతుంది అని, కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సైతం ధిక్కరించి బాధితులను చంపుతామని బెదిరిస్తున్నట్లు బాధితులు రెడ్డి సుబ్బారాయుడు, లక్ష్మీ దేవి మీడియాను ఆశ్రయించారు. బి.సి.లకు న్యాయం చేస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలా మాకు అన్యాయం జరుగుతుంటే మముల్ని పట్టించుకుని మాకు న్యాయం చేసే వారే లేరా? అని బాధితులు వాపోయారు.
తమకు న్యాయం జరగకపోతే ఇక్కడే తాను తన కుటంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని చనిపోతాం అని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. పలుమార్లు రెవిన్యూ వారికి సమస్య గురించి వివరంచుకోగా అలసత్వము, జాప్యము ప్రదర్శించి మాకు న్యాయం చేయలేదని బాధితులు వాపోయారు. కాగా సంబంధిత సర్వేయర్ ఆక్రమనదారులతో కుమ్మక్కై సర్వే క్రమము నిలిపి వేసి బాధితులు పలుమార్లు సర్వే చేయమని సంప్రదించినప్పటికి పలు కారణాలచేత దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ, చివరిగా నేడు మీడియా మిత్రులు సర్వేయర్ ను ఫోను ద్వారా సంప్రదించగా, ఇది నా పరిధి కాదు, రెపటి నుండి కొత్త సర్వేయర్ ఇక్కడికి రానున్నాడు ఏదయినా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అంటూ ఫోన్ కట్ చేశారని. తమకు చెందిన భూమిలో ఆక్రమనదారులు తమ భూమిని ఆక్రమించడమే కాక కట్టడాలు నిర్మించారని, ఆ కట్టడాలు తొలగించి, భూ కబ్జాదారుల నుండి తమ భూమిని తమకు ఇప్పించాలని బాధితులు వాపోయారు.



Comments