top of page

సమస్యలు పరిష్కరించాలి : ఆర్టీసీ ఉద్యోగులు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 5, 2023
  • 1 min read

సమస్యలు పరిష్కరించాలి : ఎంప్లాయిస్ సమస్యలు

వినతి పత్రం సమర్పిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాజంపేట ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి బి.సి శేఖర్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ప్రజా రవాణా అధికారి పి.రాము కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బి.సి శేఖర్ మాట్లాడుతూ రాజంపేట డిపో నుండి శ్రీశైలం, మదనపల్లి, పెంచలకోన, తిరుపతి మొదలగు సర్వీసులను నడపాలని కోరారు. డ్రైవర్లు, కండక్టర్లకు నూతన చార్ట్ వేయించాలని అన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి డిపో అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జోనల్ ఉపాధ్యక్షులు రమణ, మౌలా, అంకయ్య, బాషా, సుబ్బయ్య, పుల్లయ్య చిన్నోడు, సీనియర్ నాయకులు బాలాజీ, చలపతి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page