మా ఊళ్లో ఒక అపరిచితుడు!
- VOICE OF HERALD

- Jul 30, 2022
- 1 min read
మా ఊళ్లో ఒక అపరిచితుడు! అర్ధరాత్రి పూట ఇంటి కిటికీలలో నుంచి తొంగి చూస్తున్న వైనం?
మా ఊళ్లో ఒక అపరిచితుడు! ఇలాంటి వార్తలు మీరు నమ్ముతారా?
నమ్ముతాను...
నమ్మను...
అందరూ నిద్రిస్తున్న వేళ మీకు ఒక అపరిచితుడు సడన్ గా కిటికీలో దర్శనం ఇస్తే ఎలా ఉంటది? ఇక్కడ అదే జరిగింది. అర్ధరాత్రి ఒక అపరిచితుడు పచ్చర్ల గ్రామంలో కలియతిరుగుతున్నాడన్న సమాచారం తెలియవచ్చింది. ఇతడు ఇళ్ల దగ్గర కిటికీల నుంచి లోపలికి తొంగి చూడటం, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్ల తలుపులను తట్టడం చేస్తున్నాడని సమాచారం. ఇతని చూడటానికి పొడువుగా, నల్లగా ఉన్నట్టు చూసిన మహిళలు, వ్యక్తులు చెబుతున్నారు. ఇంతకీ ఈ అపరిచితుడు ఎవరు? అతనికి ఏమి కావాలి? ఎందుకు రాత్రిళ్ల పూట తిరుగుతున్నాడు? అతని దొంగనా? రేపిస్టా? శాడిస్టా? ఈ ఊరి వాడేనా? లేదా కొత్త వ్యక్తా? అనేది తెలియాల్సి ఉంది.
జులై 29, శుక్రవారం రాత్రి బీసీ కాలనీలోని ఒక ఇంటి వెనకాల ఉన్న కిటికీలో నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారు జామున 3 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల మధ్య కలియతిరడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది ఒక మహిళ. అది చూసి దెయ్యమేమో అనుకొని కాసేపు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నంత పని అయిందామెకు.. ఆమెకు భయం వేసి తన భర్తకు విషయం తెలిపింది.



Comments