top of page

ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంక‌టేశ్వ‌ర్లు దారుణ హ‌త్య‌

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 10, 2022
  • 1 min read
ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంక‌టేశ్వ‌ర్లు – దారుణ హ‌త్య‌.

కర్నూలు జిల్లాకు చెందిన, హైకోర్టు న్యాయవాది ఆవుల వెంక‌టేశ్వ‌ర్లును దారుణంగా హత్య చేశారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేది నుంచి అదృశ్యమైన వెంకటేశ్వర్లు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహానంది పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు. . మృతుడు వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని టెలికం నగర్ లో నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో వకాలత్ తీసుకొని కోర్టులో ఆయన వాదిస్తున్నారు. భూ వివాదం క్రమంలోనే ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీటిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page