top of page

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 29, 2023
  • 1 min read

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

తిరుమల శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్‌, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page