top of page

హోలీ' పండుగ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 17, 2022
  • 1 min read

“హోలీ" పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

'హోలీ' పండుగ రంగులతో కూడిన ఉత్సాహ పూరితమైన వేడుక, ఇది ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని , సద్భావనను బలోపేతం చేస్తుంది. సమాజంలో శాంతి, శ్రేయస్సును సూచిస్తుంది. 'హోలీ' రంగులు చల్లుకునే ఆనందకరమైన వేడుకల ద్వారా జాతీయ సమైక్యతపై మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. హోలీ పండుగ స్ఫూర్తి అన్ని సామాజిక అడ్డంకులను అధిగమించి సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది. సత్యం యొక్క శక్తిని, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం ద్వారా ప్రజలు రక్షణగా ఉండాలని, కోవిడ్‌కు తగ్గ ప్రవర్తనా నియమావళి కొనసాగించాలని, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన సందేశాన్ని తెలియచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page