top of page

నూకాలమ్మ ఆలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ శ్రీ శ్రీ లక్ష్మి కోలాటం

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 17, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర వార్త, అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ శ్రీ శ్రీ లక్ష్మి కోలాటం ప్రదర్శించడం జరిగింది.

అనకాపల్లి శ్రీ నూకాంబిక ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్టీల్ ప్లాంట్ శ్రీ శ్రీ లక్ష్మి మహిళా గ్రూపు వారు కోలాటం ప్రదర్శించి అనంతరం పారాయణం చేయడం జరిగింది పెందుర్తి నుండి మీనాక్షి కూచిపూడి టీం బాలికలు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా స్టీల్ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నుకాంబిక ఆలయ ఈవో ఆలయ ట్రస్ట్ భక్తులకు సౌకర్యంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.

మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సాహం ఉన్నవారికి ఆలయంలో ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా శ్రీ నూకాలమ్మ ఆశీస్సులు అంద చేయాలని ప్రత్యేక పూజలు చేసి మెక్కు కొవడం జరిగింది. ఈ ప్రదర్శనలో భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది భక్తులు పోటెత్తి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కోలాటం టీం లీడర్ శ్రీమతి రామలక్ష్మి శ్రీమతి శాంతి, డాన్స్ టీచర్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page