top of page

అమృత నగర్ లో హెల్త్ క్లినిక్ నిర్మాణం భూమి పూజ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 28, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న అమృత నగర్ లో హెల్త్ క్లినిక్ నిర్మాణం భూమి పూజ చేసిన సర్పంచ్ కొని రెడ్డి శివ చంద్రారెడ్డి, రూ. 17.50 లక్షల నిధులతో నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. మొత్తం అమృత నగర్ లో 2 సచివాలయాలు, రెండు హెల్త్ క్లినిక్ లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అమృత నగర్ కు డిజిటల్ లైబ్రరీ కూడా మంజూరు అయ్యింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటుచేసిన ఈ కాలనీకి, పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడికి రావడం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ మేరకు ఇప్పటికే 54 వీధుల్లో సిసి రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశాం. ఈ కాలనీలో డ్రైనేజి ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి దృష్టికి గౌరవ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకెళ్లాం త్వరలో కలెక్టర్ను కలిసి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు సహకారం కోరతాం... పూజా కార్యక్రమంలో ఎంపీటీసీ భాగ్యమ్మ వార్డు నెంబర్ చికెన్ బాష, సచివాలయం ఇంజనీర్లు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page