top of page

అంబెడ్కర్ కు ఘన నివాళి - మరిపూడి పరదేసి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 27, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, బిసి రోడ్ కాకతీయ పెట్రోల్ బంక్ వద్ద మరిపూడి పరదేశి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం సభాధ్యక్షులు మరిపూడి పరదేశి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రవేశ పెట్టడానికి రెండు సంవత్సరాల 11 నెల 18 రోజులు పట్టిందని, మరి ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ అన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా అగ్రవర్ణాల కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్నారు తప్ప నిరుపేదలకు ఎస్సీ ఎస్టీ ఉపయోగపడే ఆలోచనలో తీసుకురావాలని పరదేశి అన్నారు, ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరిపూడి పరదేశి, గంట్యాడ గురుమూర్తి,76వ వార్డు వైస్సార్సీపీ ఇంచార్జి దొడ్డి రమణ, గొం దేశి శ్రీనివాస్ రెడ్డి, (బుజ్జి ), సంపంగి ఈశ్వరరావు, డాక్టర్ రాజారావు, కాకినాడ పెంటారావు, ములకలపల్లి వెంకటేష్, ఉమా, ధర్మపురి చక్రి, టేక్ టి శ్రీను, ఓలేటి నూకరాజు, కొత్తలంక సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page