top of page

పొద్దుటూరులో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 28, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయొద్దంటూ 28, 29 వ తారీకు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా పొద్దుటూరులో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. బిజెపి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ నియంతృత్వ పాలన చేస్తున్నాడని, కార్మికులను ఇబ్బందులు పెట్టే అనేక చట్టాలు తీసుకువచ్చారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్ట్ ఆఫీస్, టెలికం, విమానయానం వంటి సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని వీటిని వెంటనే ఆపాలని ట్రేడ్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, టెలికం, మునిసిపల్, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మునిసిపల్ కార్యాలయం నుంచి తాసిల్దార్ కార్యాలయం వద్ద భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page