top of page

ప్రత్యేక ప్యాకేజీలతో అల్ ఇన్ఫోటెక్ ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 3, 2022
  • 1 min read

అల్ ఇన్ఫోటెక్ ప్రత్యేక ప్యాకేజీలు

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు శివాలయం వీధిలోని నందిని క్లాత్ మార్కెట్ నందు గురువారం ఉదయం అల్ ఇన్ఫోటెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రిబ్బన్ కత్తిరించి పారంభించారు.

ఈ సందర్భంగా అయన ముందుగా సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆల్ ఇన్ఫోటెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్యాలయం ద్వారా విమాన టిక్కెట్ల బుకింగ్ సౌకర్యం, మక్కా యాత్రకు ప్రత్యేక ప్యాకేజి, 2022-2023 సంవత్సరానికి గాను హాజ్ మరియు ఉమ్రాహ్ ప్యాకేజీలు ప్రతి నెలా కలవని, ఉమ్రాహ్ వీసాలతో పాటు పదహారు రోజులు భోజన సౌకర్యాలతో కూడిన చక్కటి బస ఎనభై తొమ్మిది వేల రూపాయలకే ప్రారంభ దశలో ముస్లిం సోదరుల సౌకర్యార్ధం ఇవ్వనున్నామని అన్నారు.  ఇకపోతే పాస్పోర్ట్ స్టాంపింగ్, ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ల అటెస్టేషన్, వీసా స్టాంపింగ్, హనీమూన్ ప్యాకేజీలు, బ్యాంకాక్, మాల్దీవ్స్, సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ప్రత్యేక హాలిడే ప్యాకేజీలు కలవని తెలిపారు. 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page