ఈనెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి : AIAWU
- DORA SWAMY

- Mar 25, 2022
- 1 min read
చిట్వేలి, కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ,కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా..ఈనెల 28, 29 తేదిలలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో.. కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య లు కోరారు.

స్థానిక చిట్వేలి ఆటో స్టాండ్ నందు సమ్మె కరపత్రాలను విడుదల చేసి, ఈ సందర్భంగా మణి,పెంచలయ్య లు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అనేక త్యాగాల తో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాలన్నిటినీ కనుమరుగు చేస్తూ ఉందని; నిత్యావసర వస్తువుల మరియు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వం విభజనచట్టంలోని హామీలను ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విశాఖ స్టీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న సమ్మెలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వారు కోరారు.ఆ రోజున జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పెనగలూరు మండల కార్యదర్శి మద్దెల ప్రసాద్, ఉపాధ్యక్షులు నందకుమార్, చిట్వేలి మండల ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాని, సి నాగిరెడ్డి, దుర్గయ్య,రెడ్డయ్య, మురుగయ్య, రమణయ్య, చాంద్ భాషా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.



Comments