అగ్గారపు వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం
- VOICE OF HERALD

- Aug 23, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గం మునిసిపల్ పరిధిలోని 33వ వార్డు నందు ఆ వార్డు వైసీపీ ఇంచార్జి అగ్గారపు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు వైసీపీ శాసనసభ్యుడు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డ. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా? లేదా? అని అగిడి తెలుకొని, వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని ప్రజలకు వివరిస్తూ, వార్డులోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు, వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ చైర్మన్ బి. లక్ష్మిదేవి, పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబూ, పట్టణాధ్యక్షురాలు కోనేటి సునంద, వార్డు ఇంచార్జి అగ్గారపు శ్రీనివాసులు, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.



Comments