top of page

ప్రొద్దుటూరులో సినీ నటి మెహరీన్ సందడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 31, 2022
  • 1 min read

ప్రొద్దుటూరు పట్టణంలో నేడు సినీ నటి మెహరీన్ సందడి చేసింది. డాక్టర్ కేర్ హోమియోపతి 56వ శాఖను ప్రొద్దుటూరులో సోమవారం ఉదయం ప్రారంభించటానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమెను చూడటానికి ఆమె అభిమానులు, సినీ ప్రియులు, పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున గాంధీ బొమ్మ కూడలి వద్దకు చేరుకొని ఆమెకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటి మెహరీన్ తో పాటు డైట్ కన్సల్టెంట్ వి.ఆర్.కె క్లినిక్ అధినేత వీరమాచినేని రామకృష్ణ కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కేర్ హోమియోపతి ఎండి అంబటి మహేశ్వర్ రెడ్డి సీఈవో డాక్టర్ పేర్ల సంజన ప్రొద్దుటూరు శాఖ మేనేజర్ చాంద్బాషా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page