top of page

కారును ఢీ కొన్న లారీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 25, 2022
  • 1 min read

కడప చెన్నై రహదారి ఒంటిమిట్ట చెరువు కట్టపై యాక్సిడెంట్ జరిగింది.

మండల కేంద్రమైన ఒంటిమిట్ట కట్టపై ఈ రోజు శనివారం ఉదయం 6 గంటలకు కారును ఢీ కొన్న లారీ, రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. రాజంపేట కడప వెళ్లే వాహనాలు ఒంటిమిట్ట గంగ పేరూరు ఇబ్రహీంపేట మీదుగా వాహనాలు మళ్లించారు. హైదరాబాద్ నుండి తిరుపతి కారులో వెళ్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, గాయపడిన వారిని ప్రథమ చికిత్స కోసం 108 వాహనంలో జిల్లా రిమ్స్ వైద్యశాలకు తరలించారు. హైవే రోడ్డు పై అడ్డంగా ఉన్న లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అందుబాటులోకి తెచ్చారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page