top of page

లెఫ్ట్నెంట్ కల్నల్ అభిషేక్ రెడ్డికి మానవత సన్మానం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 13, 2023
  • 1 min read

లెఫ్ట్నెంట్ కల్నల్ అభిషేక్ రెడ్డికి మానవత సన్మానం.

సిడిఎస్ ఫలితాలలో లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాను సాధించిన చిట్వేలి మండల మైలపల్లి నివాసి ముద్ద అభిషేక్ రెడ్డినీ మరియు తల్లిదండ్రులు రవికుమార్ రెడ్డి, రాధికా రెడ్డిలను చిట్వేలి మానవతా శాఖ మైలపల్లి గ్రామం చెన్నకేశవ ఆలయంలో మంగళవారం ఘనంగా సన్మానించింది

.ఈ సందర్భంగా పలువురు మానవతా సభ్యులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సిడిఎస్ కు ఎన్నికై లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాను సాధించడం, ఏకైక వ్యక్తిగా నిలవడం అతని కుటుంబానికే కాక, చిట్వేలి మండలానికే గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరారు.అతనికి అపూర్వ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు సాయిరాం, గౌరవ సలహాదారులు ఉప సర్పంచ్ ఉమామహేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ బోర్డు సభ్యులు, తిరుమల విశ్వనాథం, దొడ్ల వాగు శ్రీనివాసులు, తురక రంగారెడ్డి, సహాయ కార్యదర్శి సుబ్రమణ్యరెడ్డి, కంచర్ల సుధీర్ రెడ్డి హరిప్రసాద్, పిక్కిలి బాబు, పృద్వి, మైలపల్లి గ్రామ పెద్దలు పిచ్చిరెడ్డి, దామోదర్ రెడ్డి, శంకర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page