top of page

మానసిక వికలాంగునికి మందులు వితరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 21, 2022
  • 1 min read

మానసిక వికలాంగునికి మందులు వితరణ

స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని వై.యం.అర్ కాలనీ నందు నివాసముంటున్న మధు అనే మానసిక వికలాంగునికి ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు హుస్సేన్, భసవ సహకారముతో మధుకు మందులు వితరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆధరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ గత సంవత్సరం బాలల దినోత్సవం నాడు భవిత శిశువిహార్ నందు ఆధరణ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మధు కుటుంబ సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతినెలా అబ్బాయికి అవసరమైన మందులు దాతల సహకరంతో అందజేయడం జరుగుతున్నదని. అలాగే ఈ రోజు ఆధరణ స్వచ్ఛంద సేవా సంస్థలోని సభ్యులు హుస్సేన్, భసవ సహకారముతో మధు ఇంటి వద్ద మందులు వితరణ చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థలోని సభ్యులు అమరావతి శ్రీకాంత్, భసవ, హుస్సేన్ పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page