అన్నార్తులకు ఆపన్నహస్తం ఆదరణ సేవా సంస్థ
- VOICE OF HERALD

- Feb 15, 2022
- 1 min read
కడప జిల్లా, స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని వై.యం.అర్. కాలనీ సమీపంలో గల ప్రకాష్ నగర్ నందు గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జూపురు సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి బాగాలేక కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నదని కొందరు వ్యక్తులు ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థలు అధ్యక్షుడు బైసాని సత్య నారాయణ దృష్టికి తీసుకురాగ ఆయన సెంట్రింగ్ నిర్వాహకులు బసవరాజు, హుస్సేన్ సహకారంతో 3వేల రూపాయలు విలువచేసే సరుకులను ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జూపూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది, ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అన్నట్లు తాము అడిగిన వెంటనే సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దాతలు బసవరాజు, హుస్సేన్ కి ఆదరణ సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సుబ్బరాయుడు యాదవ్, నాగన్న, సభ్యురాలు గీత పాల్గొన్నారు.




Comments