top of page

పుల్వామా దాడిలో మరణించిన వీర జవానులకు అశ్రునివాళులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 14, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని ఆధరణ స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రొద్దుటూరు పట్టణంలోని మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు నందు గల గాంధీ విగ్రహం వద్ద పుల్వామా దాడిలో మరణించిన వీర జవానులకు అశ్రు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సైనికుల అధ్యక్షుడు సాంబశివ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ప్రేమికులరోజు కాదని దేశం కోసం తమ ప్రాణాలను వదులుకున్నవారిని స్మరించుకునే రోజుని తెలిపారు. అలాగే ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బైసాని సత్యనారాయణ మాట్లాడుతూ అమరవీరులకు జోహార్ అంటూ మాజీ సైనికుల సమక్షంలో దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్లు స్మరించుకోవడం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మాజీ సైనికులు రమేష్ బాబు,రమణ రాజు,ఖాజాపీర్ కమలాకర్ రెడ్డి, రాయుడు, ఓబులేసు, ఏ. పీరయ్య, ఆదరణ సంస్థ సభ్యులు రసూల్, కొనేటి ఓబుల రెడ్డి, బిట్టు, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page