గాలిపటం సరదా ప్రాణం తీసింది
- VOICE OF HERALD

- Jan 12, 2022
- 1 min read
సంక్రాంతి సెలవు పురస్కరించుకుని సరదాగా స్నేహితులతో గాలిపటం ఎగరవేయగా, గాలిపటం ఎగురవేసే దారమే ఓ చిన్నారి బాలుడి పాలిట యమపాశంగా మారింది, వివరాల్లోకి వెళితే, కడప జిల్లా, జమ్మలమడుగు (మం) ముద్దనూరు రోడ్డు లోని వినాయక నగర్ చెందిన అవినాష్(16) గాలి పటం ఎగరవేస్తూ ప్రమాదశాత్తూ కరెంట్ తీగలు తగలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు, అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపిన వైద్యులు. కన్నీరుమున్నీరు అవుతున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు, మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసి కుటుంబ సభ్యులను పరామర్శించిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దేవగుడి భుపేష్ రెడ్డి.




Comments