top of page

85 వార్డు టీడీపీ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డా. బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 14, 2022
  • 1 min read

అగనంపూడి ప్రసన్న ఆంధ్ర వార్త, 85 వార్డు తెలుగు దేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది.

85 వ వార్డు పెదమడక మినీ జగదాంబ వద్ద 85 వ వార్డు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 85 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కర్రి దశేంద్ర 131 వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. కర్రి దశేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో నడవాలని తెలిపారు. విశాఖ జిల్లా టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ భారత రత్న అంబేద్కర్ కార్మిక కర్షక మహిళ వెనుకబడిన తరగతుల అన్ని వర్గాల వారికి సంక్షేమం కొరకు రాజ్యాంగంలో రూపకల్పన చేయడం జరిగింది వాటిని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు పరిచిన అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించిన అవుతుంది ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ కార్యదర్శి గంతుకోరు అప్పారావు , విశాఖ పార్లమెంటరీ టిడిపి నాయకులు నెల్లి శ్రీనివాసరావు , విశాఖ పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి కసిపల్లి శ్రీనివాసరావు , గాజువాక నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు కత్తి తిలక్, డొక్కా రమేష్, సీనియర్ నాయకులు బేతా హనుమంతు రావు , దానబాల పైడికొండ, తెలుగు యువత అధ్యక్షులు బండారు చందు రమేష్, చంటి, కనకారావు, కండేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page