top of page

75 వ వార్డులో చెత్త సేకరణకు 6 కొత్త వాహనాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 31, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర విలేకరి, 75 వ వార్డులో చెత్త సేకరణకు 6 కొత్త వెహికల్స్ ను ప్రారంభించిన కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి


75 వ వార్డులో ఇంటింటా చెత్త సేకరణ కొరకు 6 కొత్త వెహికల్స్ ను ఈ రోజు 75వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పులి లక్ష్మిబాయి వెంకట రమణా రెడ్డి చేతుల మీదుగా ప్రారంబించడం జరిగింది. ఈ సందర్భములో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు. వార్డుకు ఈ వెహికల్స్ ను కేటాయించిన GVMC కమీషనర్ లక్ష్మిషా కీ అలాగే గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ కి కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, 75వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు నమ్మి అప్పారావు దోమ్మెటి పెరుమాళ్ నామాల పెంటయ్య, శ్రీనివాస రావు, టేకేటి అప్పారావు, టేకేటి పెంటయ్య వార్డు సచివాలయం సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page