చిట్వేలు ఘనంగా 75వ "వన మహోత్సవం"
- DORA SWAMY

- Jul 8, 2022
- 1 min read
75 వనమహోత్సవం రోజున చెట్లను నాటిన అధికారులు.

అన్నమయ్య జిల్లా చిట్వేలు నందు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు పి శ్రీనివాసులు, ఎస్ సావిత్రి ఆధ్వర్యంలో 75వ "వన మహోత్సవ రోజును' ఈరోజు ఉదయం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు, మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ...ప్రతి ఏడాది వనమహోత్సవాన్ని జూలై నెల మొదటి వారంలో జరుపుకుంటామని; మానవ మనుగడకు ప్రాణాధారమైన ఆక్సిజన్ ను పెంపొందించడానికి చెట్లను ప్రతి ఒక్కరూ నాటడం వాటిని పెంచడం బాధ్యతగా తీసుకోవాలని కుచించిపోతున్న అడవులను తిరిగి పునర్ నిర్మించాలని ఇది మన అందరి బాధ్యతని; ఇదే భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి అని వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో భాద్య ప్రధాన ఉపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్, ఉపాధ్యాయులు యుగంధర్, దుర్గరాజు, ఫారెస్ట్ బీట్ అధికారులు, పాఠశాల సిబ్బంది స్వాతి, కిరణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.



Comments