top of page

అక్షర, శ్రీ సాయి వికాస్ విద్యార్థులచే 75వ స్వాతంత్ర దినోత్సవ భారీ ర్యాలీ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 13, 2022
  • 1 min read

పాఠశాలల విద్యార్థులచే 75 వ స్వాతంత్ర దినోత్సవ బారీ ర్యాలీ.

---భారీ త్రివర్ణ పతాకాలతో" జై జవాన్ జై కిసాన్"అంటూ నినాదాలు.

---స్వాతంత్ర సమర వీరుల వేషాలతో,నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థిని విద్యార్థులు.

75 వ గణతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని ముందస్తుగా ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలోని అక్షర మరియు శ్రీ సాయి వికాస్ విద్యాసంస్థల పిల్లలు వారి యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి...భారత దేశ గొప్పతనాన్ని రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, సైనిక,వ్యవసాయ ఇలా పలు రంగాలలో సాధించిన అభివృద్ధిని చాటుతూ" జై జవాన్ జై కిసాన్" అంటూ నినాదాలు చేస్తూ.. భారీ పొడవైన జాతీయ జెండాలతో అందరిలోనూ జాతీయభావం నిలుపుకునేలా అమరవీరుల వేషాలను ధరించి వారి గొప్పతనాన్ని పాటల రూపంలో కోలాట నృత్యాలను చేస్తూ ఆయా పాఠశాలల నుంచి ప్రధాన రహదారి వెంబడి కలిసికట్టుగా క్రమశిక్షణతో వైయస్సార్ విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అక్షర మరియు శ్రీ సాయి వికాస్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page