top of page

చిట్వేలు మండల వ్యాప్తంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 15, 2022
  • 1 min read

పల్లె పల్లెనా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

---అన్ని కార్యాలయాల్లోనూ జాతీయ జెండాకు వందనం.

--- 120 అడుగుల జాతీయ జెండా తో ఎన్ సి సి క్యాడెట్ల భారీ ర్యాలీ.

---అన్ని శాఖల్లోనూ ఉత్తమ సేవలకు పురస్కారం.

75 వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటి యందు త్రివర్ణ పతాకం రెపరెపలాడగా ఆయా గ్రామ సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రతినిధులు జెండా వందనం చేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.

కాగా చిట్వేలి మండల కార్యాలయాలలో రెవెన్యూ కార్యాలయం నందు తాసిల్దార్ మురళీకృష్ణ జండా వందనం చేయగా ఎంపీడీవో కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి మోహన్, స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్సై వెంకటేశ్వర్లు బ్యాంకుల నందు బ్యాంకు మేనేజర్లు, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల నందు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు.. ఇలా అన్నిచోట్ల త్రివర్ణ పతాకానికి వందనాలు తెలుపగా జాతీయ జెండా ఉవ్వెత్తున రెపరెపలాడింది.



కాగా కొరముట్ల సాయి హరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చిన 120 అడుగుల త్రివర్ణ పతాకాన్ని హై స్కూల్ నుంచి ప్రారంభం మొదలు వైయస్సార్ సర్కిల్ వరకు హై స్కూల్ ఎన్సిసి క్యాడేట్లు మరియు విద్యార్థులు భాగస్వాములై దేశభక్తి గీతాలు ఆలపిస్తూ స్వాతంత్ర సమరయోధులకు జేజేలు తెలుపుతూ కార్యక్రమాన్ని కొనసాగించి మానవహారం చేపట్టి స్వాతంత్ర వీరులకు నివాళులర్పించారు.

కాగా సచివాలయ, వ్యవసాయ, రెవెన్యూ, ఉపాధి, ఆరోగ్య ఇలా అన్ని రంగాలలో నుంచి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు.. డాక్టర్ కేడీ ప్రసాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రామలింగరాజు, జెర్సీ డైరీ జోనల్ మేనేజర్ మల్లికార్జున నాయుడు తదితర అధికారులు ఈ అవార్డులు అందజేశారు.

ఈ ర్యాలీ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి,మండల ఎంపీపీ టి. చంద్ర, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, ట్రస్ట్ చైర్మన్ హరిబాబు, సిహెచ్ఎస్ బాధితులు గాడి ఇంతియాజ్, మండల యువత పి గణేష్, పి శివ,పి భరత్, మాదాసు నరసింహ , సుధీర్ రెడ్డి, ఎన్సిసి అధికారి పసుపుల రాజశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్ మరియు యువత విద్యార్థినీ విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page