top of page

41వ వార్డులో టిడిపి ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 23, 2024
  • 1 min read

41వ వార్డులో టిడిపి ప్రచారం

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి ప్రచార జోరు అందుకుంది. నాయకులు, వారి బంధువులు, అనుయాయులు గ్రామాలలో అలాగే ప్రతి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో 41వ వార్డు నందు బోగా బాల వీరయ్య, సినీ స్టార్ అంజి, చంగా సిద్దయ్య ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయగా ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టిడిపి మ్యానిఫెస్టోలో పొందుపరచిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి, టిడిపి కడప ఎంపీ అభ్యర్థిగా చడిపిరాళ్ళ భూపేశ్ రెడ్డి ని, ఎమ్మెల్యే అభ్యర్థి గా పొటీచేయుచున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు క్రియాశీలక నాయకులు, వద్ది బాలుడు, నాగార్జున, చిన్న వీరయ్య, నాగయ్య, మురళీ, రాము, సుబ్బి రెడ్డి, చంద్రమోహన్, కే. సుబ్బయ్య, చింపిరి రమణ, ఆకుల సుబ్బారాయుడు, గంగా, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page