top of page

తిరిగి టిడిపి గుటికి చేరిన 33వ వార్డు కౌన్సిలర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 28, 2024
  • 1 min read

తిరిగి టిడిపి గుటికి చేరిన 33వ వార్డు కౌన్సిలర్


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


తాజా ఎన్నికల నేపథ్యంలో టిడిపిని వీడి వైసిపి కి మద్దతు పలికిన ప్రొద్దుటూరు మున్సిపల్ 33వ వార్డు టిడిపి కౌన్సిలర్ గాజుల శివజ్యోతి ఆమె భర్త టిఎన్టియుసి జిల్లా నాయకులు కుతుబుద్దీన్ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచిన నేపథ్యంలో పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమక్షంలో తిరిగి టిడిపి గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 33వ వార్డు నందు ఏర్పాటుచేసిన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వరద హాజరై కౌన్సిలర్ శివజ్యోతి, కుతుబుద్దిన్ లకు టిడిపి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి ముఖ్య నాయకులు, 33వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page