top of page

30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ టిడిపిలో చేరిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 12, 2024
  • 1 min read

30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ టిడిపిలో చేరిక

కౌన్సిలర్ మీగడ దీప్తిని టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే వరద

కడప జిల్లా, ప్రొద్దుటూరు


నేడు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన 30వ వార్డ్ వైసిపి కౌన్సిలర్ మీగడ దీప్తి, ఆమె భర్త మీగడ చంద్రశేఖర్ రెడ్డి


షాక్ లో ప్రొద్దుటూరు వైసిపి నేతలు


ప్రొద్దుటూరు మునిసిపల్ కౌన్సిల్లో 17కు పెరిగిన టిడిపి కౌన్సిలర్ల బలం


తొందరలోనే మరి కొంతమంది టిడిపిలో చేరే అవకాశం


ప్రొద్దుటూరు మునిసిపాలిటీ టిడిపి కైవసం చేసుకొనే అవకాశం.

కడప జిల్లా, ప్రొద్దుటూరులో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టిడిపిలోకి వైసిపి కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా టిడిపిలో చేరుతున్నారు. ఈరోజు విజయదశమి సందర్భంగా 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మీగడ దీప్తి ఆమె భర్త మీగడ చందశేఖర్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, వీఎస్ ముక్తియార్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని టిడిపిలో చేరారు. కౌన్సిలర్ మీగడ దీప్తి రాకతో 17 కు చేరిన టిడిపి కౌన్సిలర్ల బలం. మరి కొంతమంది కౌన్సిలర్లు టిడిపిలో తొందరలోనే వలస వచ్చే అవకాశం కనిపిస్తోందిని అంచనా. తొందరలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టిడిపి కైవసం చేసుకోబోతోందా? కూటమి ప్రభుత్వం పాలన నచ్చి టీడీపీలో చేరుతున్నట్లు మీగడ దీప్తి తెలిపారు. టీడీపీలో చేరిన కౌన్సిలర్ల వార్డులు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి, సీఎం సురేష్ నాయుడు, వీఎస్ ముక్తియార్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page