top of page

వైసిపిని వీడి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 5, 2024
  • 1 min read

వైసిపిని వీడి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

పార్టీలో చేరిన వారితో ఎంపీ అభ్యర్థి భూపేష్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త అమృత నగర్ నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి, సినీ హబ్ రాజేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయగా, ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, నంద్యాల రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కొత్త అమృత నగర్ నందు గడపగడపకు వెళ్లి టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి, టిడిపి అభ్యర్థులుగా బరిలోకి దిగిన తమను బలపరిచి ఓట్లు వేయమని అభ్యర్థించారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. వీరికి టిడిపి మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలి బాబు రావాలని అన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు యువతకు రావాలంటే ఈ ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులైన తమను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో క్రియాశీలక టిడిపి నాయకులు వి ఎస్ ముక్తియర్, ఈవీ సుధాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, పగిడాల దస్తగిరి, జబీఉల్లా, చల్ల రాజగోపాల్ యాదవ్, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు క్రియాశీలక కార్యకర్తలు, అమృత నగర్ ప్రజలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page