top of page

వైసిపి కౌన్సిలర్ చింతకుంట సరిత రెడ్డి టిడిపిలోకి చేరిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 3, 2024
  • 1 min read

వైసిపి కౌన్సిలర్ చింతకుంట సరిత రెడ్డి టిడిపిలోకి చేరిక

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల పిరాయింపులు, చేరికలు, అలకలు, బుజ్జగింపులు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 17వ వార్డు కౌన్సిలర్ చింతకుంట సరితా రెడ్డి ఆమె భర్త మాజీ కౌన్సిలర్ చింతకుంట జయ లింగారెడ్డి ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజాల రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. నడింపల్లిలోని సమితి ఆఫీసు దగ్గర గల వీరి నివాసానికి విచ్చేసిన వరద వారికి కండువా కప్పి టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌన్సిలర్ సరిత ఆమె భర్త జయ లింగారెడ్డిల చేరిక వల్ల టిడిపికి ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందని, ఈ ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగురవేస్తామని నాయకులకు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అనంతరం వార్డులో టిడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో క్రియాశీలక నాయకులైన వి ఎస్ ముక్తీయార్, ఆసం రఘురాంరెడ్డి, ఈవీ సుధాకర్ రెడ్డి, మూలె రామసుబ్బారెడ్డి, చౌటపల్లి లక్ష్మిరెడ్డి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, నల్లబోతుల నాగరాజు, జనసేన నాయకులు జిలాన్, పలువురు బిజెపి నాయకులు, 17వ వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page