top of page

150 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 19, 2023
  • 1 min read

150 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణంలో 150 రూపాయల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గురువారం ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు భూమి పూజలు జరగనున్నాయి ఇందులో భాగంగా ఫేస్-1 అమృత్ మంచినీటి పథకం, మున్సిపల్ గాంధీ పార్క్, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవాలు, మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ భూమి పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖామాత్యులు తానేటి వనిత, పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, ఉపముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ మాత్యులు షేక్ అంజాద్ బాషా, కడప నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కే సురేష్ బాబు పాల్గొననున్నారు.


గురువారం ఉదయం 11 గంటలకు కొర్రపాడు రోడ్డు లోని రాజన్న భోజనం ప్రాంగణం వద్ద రాచమల్లు వారి రాజన్న భోజనం ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొని ప్రజల ఉద్దేశించి మాట్లాడనున్నారు. కావున ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page