top of page

నీటి గుంతలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • May 16, 2023
  • 1 min read

నందలూరు మండలం ఆరవపల్లె తోటపాలెం లో విషాదం చోటు చేసుకుంది.కన్యక చెరువు నీటి గుంతలో ఈతకు వెళ్లి పోలిచేర్ల సంతోష్ (15) అనే యువకుడు మృతి చెందాడు.

నీటి గుంతలో ఈతకు వెళ్లి పోలిచేర్ల సంతోష్

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లె తోట పాలెం లో సోమవారం ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని గాంధీనగర్ చెందిన సంతోష్ (15) ఈతకు వెళ్లి మృతి చెందారు. కన్యకా చెరువులో సరదాగా ఈత ఆడేందుకు ముగ్గురు యువకులు వెళ్లగా, ఇద్దరు బాలురు పైన ఉండగానే వారికి తెలియ కుండా నీటిలోకి దిగిన సంతోష్ ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతి చెందాడు. ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీయగా,మృతుని తల్లిదండ్రులు కన్నీటి పర్వం అయ్యి, శోక సంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలం చేరుకున్న నందలూరు ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. అయితే చెరువులో మట్టి మాఫియా మట్టి తీయడం వల్లనే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఇటువంటి ప్రమాదాలకు తావిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page