top of page

15 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 3, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి, ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మూడు పూటలా ఆహరం అందించాలనే సదుద్దేశంతో కోట్లు ఖర్చు చేసి సబ్సిడీ క్రింద అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా SEB దాడులు నిర్వహిస్తున్న అక్రమార్కులు మాత్రం తమ పంధా మార్చుకోలేదు, తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ నందు సుమారు పదిహేను టన్నుల రేషన్ బియ్యాన్ని మహీంద్రా బొలెరో క్యాంపర్ అలాగే లారీలో తరలిస్తుండగా తిరుపతి విజిలెన్సు అధికారులు వలపన్ని దగ్గరుండి పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు, ఈ దందా వెనుక అసలు సూత్రదారులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page